వింజమూరు లోని టిడిపి కార్యాలయంలో ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామానికి చెందిన, ఉదయగిరి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు గుండుపల్లి మాలకొండయ్య, మాజీ ఎంపీటీసీ పాముల రమణయ్య, కొండా మధుసూదన్ రావు, మరియు వారి అనుచర వర్గం, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో శుక్రవారం తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసిపికి గట్టి దెబ్బ తగిలింది. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.