వరికుంటపాడు: ఎదురెదురుగా రెండు బైకులు ఢీ.. నలుగురికి గాయాలు

వరికుంటపాడు మండలం, తోటల చెరువుపల్లి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తోటల చెరువుపల్లి కి చెందిన రమేష్, ప్రసాద్ బుల్లెట్ బైక్ పై గండిపాలెం వస్తున్నారు. ఇదే సమయంలో పెద్దిరెడ్డి పల్లెకు చెందిన రసూల్, వెంకటరమణయ్య, గండిపాలెం నుంచి పెద్దిరెడ్డిపల్లికి బైక్ పై వస్తుండగా బుల్లెట్ బైక్ ఎదురుగా వచ్చి వారి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉదయగిరి హాస్పిటల్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్