కుడారి తిరుపాలు అమ్మవారిని దర్శించుకున్న వేమూరి ముసలయ్య

దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలోని శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కుడారి తిరుపాలు ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆలయ వ్యవస్థాపక ప్రధాన ధర్మకర్త వేమూరి ముసలయ్యను శాలువాతో సత్కరించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రశంసించి, రాబోయే బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్