చింతోడు భూ రికార్డుల నమోదుపై గ్రామస్తుల అనుమానాలు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరిలోని సీతారాంపురం మండలం చింతోడు గ్రామంలో ఇటీవల నిర్వహించిన భూ రీ సర్వేలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎస్సీ భూముల పేర్లను తొలగించి ఇతరుల పేర్లు నమోదు చేశారని, ప్రభుత్వ భూములను సైతం వ్యక్తుల పేర్లపై ఆన్‌లైన్‌లో నమోదు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల దేవమ్మ చెరువు రీ సర్వేలోనూ ఇలాంటి ఆరోపణలు రావడంతో, ఈ రీ సర్వేలోనూ అవకతవకలు జరిగి ఉండవచ్చని ప్రజలు భావిస్తున్నారు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని శుక్రవారం వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕