వింజమూరు: అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

కర్నూలు బస్ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వింజమూరు మండలం గోళ్లవారి పల్లి గ్రామానికి చెందిన గోళ్ల రమేష్, అనూష, శశాంత్, మన్విత్ ల అంతిమయాత్రలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని, రమేష్ తల్లిదండ్రులను ఓదార్చడానికి మాటలు సరిపోవట్లేదని, ఎమ్మెల్యే సైతం కంటతడి పెట్టారని తెలిపారు. అంతిమ యాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్