సీతారామపురం మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గొల్లపల్లి సంతోషమ్మకు ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేసింది. స్థానిక నాయకుల చొరవతో అధికారులు స్పందించి, ఆమె పరిస్థితిని గుర్తించి పింఛన్ అందేలా చర్యలు చేపట్టారు. ఐటీడీపీ మండల కన్వీనర్ మొత్తంశెట్టి చెన్నకృష్ణయ్య, మొత్తంశెట్టి రవిచంద్రుడు, సచివాలయ సిబ్బంది షేక్ అబీద్ కలిసి సంతోషమ్మకు బుధవారం పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా సంతోషమ్మ ప్రభుత్వానికి, సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.