వరికుంటపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు వైసీపీ జెండా ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే ప్రతినిత్యం పార్టీ తపిస్తుందన్నారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవతరించిందన్నారు.