అనంతపురం: టీడీపీలో చేరిన 44వ డివిజన్ కార్పొరేటర్ శాంతి సుధ

అనంతపురం నగరపాలక సంస్థలోని 44వ డివిజన్ కార్పొరేటర్ శాంతి సుధ టీడీపీలో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ ఆధ్వర్యంలో భర్త మధుసూదన్ గౌడ్తో పాటు పలువురితో కలిసి ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. గతంలో తాము అనుకోని కారణాలతో పార్టీ నుంచి బయటికి వచ్చామని, తిరిగి పార్టీలో చేరామని కార్పొరేటర్ శాంతి సుధ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్