అనంతపురం: విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: డీఈఓ

అనంతపురం జిల్లాలో మండల విద్యాశాఖ అధికారులు రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి ఆదివారం తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన భవనాల్లో పాఠశాల నిర్వహించకుండా చూడాలన్నారు. అదేవిధంగా పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే రహదారుల్లో వంకలు, వాగులు ఉండే పాఠశాలలను ముందుగా గుర్తించి ఇబ్బంది పడకుండా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్