అనంతపురం: డిగ్రీ 2వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

ఎస్ కే యునివర్సిటీ పరిధిలో డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత బుధవారం విడుదల చేశారు. మొత్తం 8, 551 మంది పరీక్ష రాయగా 3, 392 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బి. ఎ లో 461 మందికి గానూ 108 మంది, బి. బి. ఏ లో 818 మందికి గానూ 353 మంది, బి. సీ. ఏ లో 174 మందికి గానూ 62 మంది, బీసీఎం లో 4, 512 మందికి గానూ 1, 635 మంది, బీఎస్సీ లో 2, 586 మందికి గానూ 1, 234 మంది ఉత్తీర్ణత చెందారు.

సంబంధిత పోస్ట్