అనంతపురం జిల్లాలో జులై 7, 8 తేదీలలో అనంత క్రీడా ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ పోటీలు బుక్కరాసముద్రం హైస్కూల్ లో జరుగుతాయి. జులై 7న కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ (U14) మరియు జులై 8న అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తారు. బుక్కరాయసముద్రం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చు. ఈ మేరకు జరిగిన సమావేశంలో ఎంపీపీ, ఎంపీడీవో, ఎంఈఓ, మండల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు పాల్గొన్నారు.