తాడేపల్లిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ శుక్రవారం వైసీపీలోకి చేరారు. ఆయనకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు బండ్లపల్లి ప్రతాపరెడ్డి, తదితరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాల్గొన్నారు.