అనంతపురం నగరంలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ రాంకుమార్ తెలిపారు. విద్యార్థుల కెరీర్ పోర్ట్ఫోలియో, ప్లేయర్ ప్రొఫైల్ మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈనెల 30న ఉదయం 9 గంటలకు ఉద్యోగమేళా జరుగుతుందని, B.Com, BBA, MBA, B.Tech, డిగ్రీ పూర్తిచేసిన, చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులని ఆయన పేర్కొన్నారు.