గుడివాడ ఎమ్మెల్యే PA పేరును దుర్వినియోగం చేస్తూ కేటరింగ్ వ్యాపారులను మోసం చేసి రూ. 1.73 లక్షలు కాజేసిన మాచినేని సంతోశ్ కుమార్ (28) అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతపురం (D) కృష్ణంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నిందితుడిపై BNS సెక్షన్ 318(4)తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66(C) కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సోమేశ్వరావు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.