జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అనంత క్రీడలు’లో భాగంగా ఉరవకొండలో జూలై 6, 7 తేదీల్లో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రవిప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పీడీలతో నిర్వహించిన సమావేశంలో ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొనేలా చూడాలని మంగళవారం ఆయన సూచించారు. మండల స్థాయిలో విజేతలైన క్రీడాకారులు నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని వెల్లడించారు.