అనంతపురం నగర శివారులో శుక్రవారం భార్యపై అనుమానంతో భర్త ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రామకోట గ్రామానికి చెందిన అఖిల (24)కు అనంతపురంలోని ఎర్రనేలకొట్టాలకు చెందిన రాజేశ్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. భార్య తరచూ ఫోన్లో మాట్లాడటంతో అనుమానంతో గొడవలు జరిగేవి. శుక్రవారం మధ్యాహ్నం కూడా ఫోన్ మాట్లాడుతుండగా గొడవ జరిగింది. నేషనల్ పార్క్ సమీపాన ఉన్న వంక వద్దకు మాట్లాడుకుందామని తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం భర్త నేరుగా రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.