అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఫుట్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం జిల్లాలో ఉన్న 42పోలీస్ స్టేషన్ల పరిధుల్లోనూ గడచిన 24 గంటలలో విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు. మట్కా, పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. గంజాయి, అక్రమ మద్యం, నాటు సారా, తదితరాలు అక్రమ రవాణా జరుగకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఏటీఎం కేంద్రాలను చెక్ చేసి భద్రతపై సమీక్షించారు.

సంబంధిత పోస్ట్