రాష్ట్రపతి పర్యటన: పటిష్ట భద్రత, ఏర్పాట్లు పక్కా - ఎస్పీ జగదీశ్

భారత రాష్ట్రపతి బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి సెంట్రల్ యూనివర్సిటీకి రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టినట్లు ఎస్పీ జగదీశ్ సోమవారం తెలిపారు. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట భద్రత, ASL (అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్) నిర్వహణ ఉంటుందని ఆయన చెప్పారు. హెలిప్యాడ్, సభా స్థలి పనులు ఇప్పటికే పూర్తయ్యాయని ఎస్పీ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్