అనంతపురం జిల్లా సిద్ధరాంపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు, 28.06.2026న జరగనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని, గ్రామంలో పల్స్ పోలియో అవగాహన ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. హెచ్.ఎం నీరజ, పి.డి నాగరాజు, ఆశా వర్కర్ రామాంజనేయమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. "పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం - మన పిల్లల భవిష్యత్తును కాపాడుకుందాం!" అనే నినాదంతో విద్యార్థులు గ్రామ వీధుల్లో చైతన్యపరిచారు.