పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు

హిందూపురం రూరల్ పరిధిలోని లేపాక్షి మండలంలోని విభూదిపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. నలుగురు పేకాట రాయుళ్లని అరెస్టు చేసి వారి నుండి 6ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట నిర్వహిస్తున్న విభూదిపల్లి గ్రామానికి చెందిన రామంజితో పాటు మరో 9మంది పరారైనట్లు ఎస్సై తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్