బత్తలపల్లి మండలం రామాపురం బస్టాప్ వద్ద ఈనెల 20న పట్టపగలే తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న శుక్రవారం తెలిపారు. ధర్మవరంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ కు చెందిన 8 మందిని అరెస్టు చేశామన్నారు. 2 కార్లు, 2 నకిలీ తుపాకులు, 19 నకిలీ ప్లాస్టిక్ బుల్లెట్లు, 2 కేజీల నకిలీ బంగారు పూసల ఛైన్, ఒక వాకి-టాకీ, మైకు స్వాధీనం చేసుకున్నామన్నారు.