వజ్రకరూర్ మండలంలో మహిళ మిస్సింగ్.!

వజ్రకరూరు మండలం రూపానాయక్ తాండలో లీలాబాయ్ అనే గిరిజన మహిళ గతనెల 28వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. పుట్టింటికి వెళ్తానని చెప్పి వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధి పేరుతో పుట్టపర్తికి చెందిన ఓ యువకుడు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, లీలాబాయ్ అనంతపురం ఆర్టీసీ బస్టాండు వద్ద ఓ బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

సంబంధిత పోస్ట్