ఆదివారం ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం సమీపంలో ఓ సీఎన్జీ వాహనం నియంత్రణ కోల్పోయి 11 కేవీ విద్యుత్ టవర్‌ను బలంగా ఢీకొట్టింది. కదిరి నుంచి అనంతపురం వైపు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ట్రాన్స్కో అధికారులు ముదిగుబ్బ పోలీసులకు ఫిర్యాదు చేశారు.