గుండెపోటుతో ముదిగుబ్బ వాసి మృతి

విజయవాడలో ఇంటర్ చదువుతున్న కూతురిని పరీక్షల అనంతరం తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రి గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. ముదిగుబ్బకు చెందిన శ్రీనివాసరెడ్డి కూతురు విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఆఖరి పరీక్ష అనంతరం ఇంటికి తీసుకొచ్చేందుకు భార్యతో కలిసి వెళ్లాడు. కూతురుని పరీక్షకు పంపి వారు షాపింగ్ చేస్తుండగా ఛాతీలో నొప్పితో కుప్పకూలి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

సంబంధిత పోస్ట్