ధర్మవరం నుండి కొత్తచెరువు వెళ్ళే ప్రధాన రహదారిలో శుక్రవారం రాత్రి నుంచి కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా ఆమిదలకుంట ప్రధాన రహదారి పూర్తిగా మునిగిపోయింది. రహదారి మీద భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాంత ప్రజలు మరియు ప్రయాణికులు ఈ తీవ్ర పరిస్థితి పై శాశ్వత పరిష్కారాన్ని కోరుతున్నారు.