ఇంటర్ విద్యార్థినిని అపహరణకు యత్నం

ధర్మవరం పట్టణంలో మంగళవారం ఇంటర్ విద్యార్థినిని అపహరణకు యత్నించడం కలకలం రేపింది. పరీక్ష రాసి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన బాలిక, లక్ష్మీచెన్నకేశవపురం కూడలి వద్ద ఆటో పుట్టపర్తి వైపు వెళ్తుండటంతో ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించింది. అనంతరం ఆటోలో నుంచి కిందకు దూకింది. ఈ క్రమంలో తలకు గాయాలైన బాలికను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు యువకులు, ఒక మహిళ ఉన్నారని బాలిక పోలీసులకు తెలిపింది.

సంబంధిత పోస్ట్