బిఎస్పీ జిల్లా కార్యదర్శి రాంప్రసాద్‌కు ఘన సన్మానం

ధర్మవరంలో బిఎస్పీ శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శిగా నియమితులైన మాల్యవంతం రాంప్రసాద్‌ను బుధవారం ఏపీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు కేశగాళ్ల వెంకటేష్ ఘనంగా సన్మానించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు బిఎస్పీ సరైన వేదిక అని వెంకటేష్ పేర్కొన్నారు. రాంప్రసాద్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి, బహుజనుల హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిడిగల్లు ధను, నారాయణస్వామి, హరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕