తీవ్ర మనస్తాపంతో ఉరి వేసుకుని కార్పెంటర్ మృతి

ధర్మవరం మండలంలోని మల్కాపురం గ్రామానికి చెందిన డి. మురళి (కార్పెంటర్) గురువారం మనస్థాపంతో ఉరి వేసుకుని మృతి చెందాడు. బుధవారం ప్రేమ వివాహం చేసుకున్న మురళి భార్యను ఆమె తల్లిదండ్రులు అదే రాత్రి తమ వెంట తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

సంబంధిత పోస్ట్