ధర్మవరం 32వ వార్డు విజయం: సమస్యలు పరిష్కరిస్తాం - గస్తీ ప్రమీల

ధర్మవరంలో జరిగిన ఎన్నికల్లో 32వ వార్డు కౌన్సిలర్‌గా ఘన విజయం సాధించిన గస్తీ ప్రమీల, తనను గెలిపించిన వార్డు ప్రజలకు బుధవారం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా నెరవేరుస్తామని, ముఖ్యంగా వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ ఇంచార్జ్ గస్తీ ఓంకార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విజయోత్సవ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕