ధర్మవరంలో దొంగిలించిన ఐడీఎఫ్‌సీ ఏటీఎం మెషీన్‌ను రాప్తాడు మండలం హంపాపురం జాతీయ రహదారి సమీపంలోని వ్యవసాయ పొలంలో పోలీసులు గుర్తించారు. సీఐ నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్స్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, ఏటీఎంలో రూ.7.50 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం.