వైఎస్ జగన్ లేకుంటే షర్మిలకు విలువ లేదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శుక్రవారం అన్నారు. షర్మిలను జగన్ కూతురిలా చూసుకున్నారు. 2019లో సీఎం అయ్యాక కొన్నినెలలకే ఆస్తి పంపకాలు చేశారు. కోర్టు కేసులు ఉండటంతో వారికి నమ్మకం కలిగించేలా ఎంవోయూ చేశారు. కానీ షర్మిల, విజయమ్మ జగన్ కు నష్టం చేస్తున్నారు. తాజా పరిణామాలను జగన్ గుర్తించకపోతే బెయిల్ రద్దయ్యేది. ముందుగా గుర్తించి ఎన్. సి. ఎల్. టిలో కేసు వేశారని ట్విట్టర్ లో పేర్కొన్నారు.