ధర్మవరం: నవంబర్ 1 నుంచి జల్దిపూజ, జాతర కార్యక్రమం

ధర్మవరం పట్టణంలోని నాగులబావి వీధిలో నవంబర్ 1వ తేదీ శుక్రవారం నుంచి 3వ తేదీ అదివారం వరకు శ్రీ నాగులబావి గంగమ్మ తల్లి, వీరదిమ్మమ్మ, భైరవ స్వామి జల్దిపూజ, జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నామని పూజారులు తెలిపారు. 1న యలవ గంప కార్యక్రమం, 2న గంగపూజ, అన్నదానం, గ్రామోత్సవం, 3న బోనాలు, యాటలు బలి ఇవ్వటం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యావత్తు భక్తులు విరివిగా తరలిరావాలని కోరారు.

సంబంధిత పోస్ట్