ధర్మవరం పట్టణం 36వ వార్డు కొత్తపేటలో చేనేత కార్మికుడు శంకర ఈశ్వరయ్య (70) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు రాయపాటి శివానంద, ఓం ప్రకాష్ ఈశ్వరయ్యకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.