ధర్మవరం: రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృతి

ధర్మవరంలోని 8వ వార్డ్ కేశవ నగర్ కు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పామిశెట్టి మహేంద్ర (34) వారం రోజుల క్రితం బైక్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తిరపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్, మహేంద్ర ఆదివారం మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మహేంద్ర కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్