డిగ్రీ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

ధర్మవరం కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరి తేదీని ఈనెల 20 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి గురువారం తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్ ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు గడువు పొడిగించామన్నారు. ఈనెల 31న అర్హులైన విద్యార్థులకు కళాశాలలో ఆయా కోర్సుల్లో సీట్లు కేటాయించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్