ధర్మవరం పట్టణంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ వార్షికోత్సవం సందర్భంగా, రూరల్ పరిధిలోని గొట్లూరు అనాథ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించినట్లు బ్యాంక్ బ్రాంచి మేనేజర్ కె. సతీష్ కుమార్ తెలిపారు. బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సామాజిక సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కె. సతీష్ కుమార్, ఏ శివ ప్రసాద్, గురు రాఘవేంద్ర, హరి ప్రసాద రెడ్డి, నాగమణి, వనిత, మధు, అమర్ నాధ్, ఆశ్రమం ఫౌండర్ సీనియర్ జర్నలిస్ట్ ఎల్ ప్రపుల్ల చంద్ర పాల్గొన్నారు.