శనివారం అనంతపురం-చెన్నై జాతీయ రహదారిలోని తంబాపురం మలుపు వద్ద ఆటో, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోల్తా పడిన ఆటోలోని నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే 108 వాహనం ద్వారా గాయపడిన వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.