రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

బుధవారం బత్తలపల్లి మండలం యర్రాయపల్లి క్రాస్ వద్ద బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో రామాపురానికి చెందిన ఆర్ఎంపీ వైద్యులు రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తిరుపాలు అనే వ్యక్తి గాయపడటంతో అతన్ని ఆర్డీటీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్