రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

బత్తలపల్లి బైపాస్ జంక్షన్ వద్ద ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాకే ఈశ్వరయ్య (45) శనివారం మరణించారు. అనంతసాగరం గ్రామానికి చెందిన ఈశ్వరయ్యకు ఐచర్ వాహనం ఆటోను ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురంలో చికిత్స పొందుతూ ఆయన పరిస్థితి విషమించడంతో మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్