ధర్మవరంలో వ్యక్తి హత్య

ధర్మవరం పట్టణం శాంతినగర్ లో పూల రమణారెడ్డి (40) అనే వ్యక్తి బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు. మదనపల్లిలో కరెంటు మగ్గాలు నిర్వహిస్తున్న రమణారెడ్డి, తేరు పండుగ కోసం ధర్మవరంలో తల్లి వద్దకు వచ్చాడు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన అతను, తెల్లవారుజామున ఇంటిముందు విగత జీవుడై పడి ఉన్నాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్