పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించిన ధర్మవరం నియోజకవర్గ విద్యార్థులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. శుక్రవారం విజయవాడ నుండి వర్చువల్ కాల్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మంత్రి ముచ్చటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మంచి మార్కులు సాధించినందుకు ఉపాధ్యాయులను కూడా ఆయన అభినందించారు.