గారపురం అంగన్వాడి కేంద్రంలో పౌష్టిక ఆహార వార్షికోత్సవాలు

ఓబులదేవరచెరువు మండలం గౌరాపురం అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పౌష్టికాహార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పౌష్టికాహారం ప్రాధాన్యత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. పౌష్టికాహారంతో తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉంటారని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీడీపీఓ రెడ్డి రమణమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్