ధర్మవరంలో భూ సమస్యలు పరిష్కరించండి: శ్రీరామ్

ధర్మవరం నియోజకవర్గంలోని భూ సమస్యలను పరిష్కరించాలని నియోజవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం విజయవాడలో మంత్రిని కలిసి తుంపర్తి భూ సమస్యలను వివరించారు. రూరల్ మండల పరిధిలో గృహ నిర్మాణాల కోసం సేకరించిన వ్యవసాయ పొలాలకు నేటికీ పరిహారం అందలేదని తెలియజేశారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్