గరుగుతాండ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

బుక్కపట్నం మండలం గరుగుతాండ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంగా వచ్చిన కారు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఢీకొన్న ధాటికి ఆటో రోడ్డు అవతలికి ఎగిరిపడిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్