అదుపుతప్పిన స్కూల్ బస్సు... విద్యార్థులకు స్వల్ప గాయాలు

చెన్నేకొత్తపల్లి మండలంలోని ఒంటికొండ వద్ద వంశీకృష్ణ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ధర్మవరం నుంచి విద్యార్థులతో వెళ్తుండగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. స్వల్ప గాయాలతో వారు సురక్షితంగా బయటపడ్డారు. పెనుప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్