ధర్మవరం మండలంలో సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. తుమ్మల గ్రామంలో గురువారం ఉ. 11 గంటలైనా సచివాలయానికి తాళాలు తీయకపోవడంతో వివిధ పనులపై వచ్చిన ప్రజలు, రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గంటలు తరబడి వేసి ఉన్నా తాళాలు తీయకపోవడంతో వెనుతిరిగారు.