శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం గిర్రాజు నగర్ లో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను పట్టణ బీజేపీ ఉపాధ్యక్షుడు చన్నా ఆదినారాయణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీ నబి రసూల్, ఓబీసీ పట్టణ నాయకులు దాదా పీర్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.