ధర్మవరంలో ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య

ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన వైష్ణవి (15) మంగళవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి వైష్ణవిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. వైష్ణవి పదవ తరగతి పరీక్షలు ఇటీవలే రాసిందని ఆమె ఆత్మహత్యకు గల కారణాలు విచారణలో తెలియాల్సి ఉందని ధర్మవరం గ్రామీణ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్