శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థి పరిసే సుధాకర్ చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో, తన సమీప వైయస్సార్సీపీ ప్రత్యర్థి కాచర్ల ఆంజనేయులపై సుధాకర్ 21,300 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూటమి హవా స్పష్టంగా కనిపించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. విజయం తర్వాత నూతన చైర్మన్ పరిసే సుధాకర్‌ను పలువురు నేతలు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలిపారు.