ఒక్క ఓటుతో గెలిచిన వైసీపీ అభ్యర్థిని

ధర్మవరం మున్సిపాలిటీ 1వ వార్డు ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి చెలిమి రామకృష్ణమ్మ కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ అభ్యర్థి సాకే లక్ష్మీదేవి రీకౌంటింగ్ కోరగా, అధికారులు వెంటనే స్పందించి తిరిగి ఓట్లను లెక్కించారు. అయితే, రీకౌంటింగ్‌లో కూడా ఫలితంలో ఎటువంటి మార్పు రాలేదని, రామకృష్ణమ్మే విజేతగా నిలిచారని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఉత్కంఠకు తెరపడగా, వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్

✕
✕